ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్‌ను మార్చాలనే చర్చలు జరిగాయి.
ప్రతీకాత్మక చిత్రం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్‌ను మార్చాలనే చర్చలు జరిగాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట కారణంగా అక్కడ కీలక ఈవెంట్లను నిర్వహించేందుకు అనుమతి లభించడం లేదు. అయితే కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఐపీఎల్ 2025 టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకుంది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన తర్వాత విజయోత్సవ వేడుకలను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్టేడియం భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. దీని ఫలితంగా బెంగళూరులో జరగాల్సిన 2025 మహిళల ప్రపంచ కప్ మ్యాచ్‌లను కూడా ఇతర వేదికలకు మార్చారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026కు ముందు ఆర్సీబీ మ్యాచ్‌లను కూడా తరలించవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. కానీ, తాజా ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది.