పృథ్వీ షాపై కన్నేశాయ్!

టీమిండియా వెటరన్ బ్యాటర్ పృథ్వీ షా ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. ఈ టోర్నీలో మహారాష్ట్ర‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా.. 7 మ్యాచ్‌ల్లో 188 పరుగులు చేశాడు.

 prithvi shaw

పృథ్వీ షా

టీమిండియా వెటరన్ బ్యాటర్ పృథ్వీ షా ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. ఈ టోర్నీలో మహారాష్ట్ర‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా.. 7 మ్యాచ్‌ల్లో 188 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు పృథ్వీ షా మెరుగైన ప్రదర్శన‌తో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో పృథ్వీ షాకు నిరాశే ఎదురైన సంగతి తెలిసిందే. అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. దాంతో అతను అన్‌సోల్డ్‌గా నిలిచాడు.ఆ తర్వాత ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టడంతో పాటు దేశవాళీ క్రికెట్‌లో జట్టు మారిన పృథ్వీ షా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. రంజీ ట్రోఫీలో 67.14 సగటుతో 470 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కూడా ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన పృథ్వీ షా.. తనలో ఇంకా సత్తా ఉందని చాటి చెప్పాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో పృథ్వీ షాను ముంబై ఇండియన్స్, కేకేఆర్, లక్నో కొనుగోలు చేసే అవకాశం ఉంది. 


2026లో 27 సాధారణ సెలవులు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్