‘క్యాండిడేట్స్‌’కు ప్రజ్ఞానంద అర్హత

భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద 2025 ఫిడే సర్క్యూట్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా 2026 క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించాడు.

praggnanandhan

ప్రజ్ఞానంద 

భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద 2025 ఫిడే సర్క్యూట్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా 2026 క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించాడు. ఇటీవల సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో పెద్దగా రాణించలేపోయిన అతడు.. తాజాగా లండన్‌ చెస్‌ క్లాసిక్‌ 2025లో ఉమ్మడి విజేతగా నిలిచాడు. దీంతో ప్రతిష్ఠాత్మకమైన క్యాండిడేట్స్ టోర్నీకి క్వాలిఫై అయ్యాడు. మొత్తం ఎనిమిది మంది పోటీపడే ఈ టోర్నీకి ఇప్పటివరకు ప్రజ్ఞానందతో కలిపి ఏడుగురు.. అనీష్ గిరి (నెదర్లాండ్స్‌), ఫాబియానో ​కరువానా (అమెరికా), మథియాస్ బ్లూబామ్ (జర్మనీ), జావోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్థాన్‌), వీ యి (చైనా), ఆండ్రీ ఎసిపెంకో (ఫిన్లాండ్‌) క్వాలిఫై అయ్యారు. ఆగస్ట్ 1, 2025 నుంచి జనవరి 1, 2026 వరకు ఫిడే స్టాండర్డ్ రేటింగ్ లిస్ట్‌ల ఆధారంగా అత్యధిక ఆరు నెలల సగటు రేటింగ్ ఉన్న ప్లేయర్ ఎనిమిదో స్థానాన్ని కైవసం చేసుకుంటాడు. 2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్ మార్చి-ఏప్రిల్ మధ్య జరగనుంది. మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి భారత్ నుంచి దివ్య దేశ్‌ముఖ్‌, కోనేరు హంపి, ఆర్‌.వైశాలి అర్హత సాధించారు.


ఆఠాణా చెల్లుతది!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్