భారత సీనియర్ పేసర్ మోహిత్ శర్మ, అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల మోహిత్ శర్మ, తన అంతర్జాతీయ కెరీర్‌లో 26 వన్డేలు ఆడి 31 వికెట్లు తీశాడు. 8 టీ20 మ్యాచుల్లో 6 వికెట్లు పడగొట్టాడు.
మోహిత్ శర్మ
భారత సీనియర్ పేసర్ మోహిత్ శర్మ, అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల మోహిత్ శర్మ, తన అంతర్జాతీయ కెరీర్‌లో 26 వన్డేలు ఆడి 31 వికెట్లు తీశాడు. 8 టీ20 మ్యాచుల్లో 6 వికెట్లు పడగొట్టాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చిన మోహిత్ శర్మ, 2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఆడాడు. 2015లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మోహిత్ శర్మ, ఐపీఎల్‌లో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2022 వేలంలో అమ్ముడుపోని మోహిత్ శర్మ, ఆ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత సీజన్‌లో వేరే బౌలర్ గాయపడడంతో రిప్లేస్‌మెంట్‌గా టీమ్‌లోకి వచ్చిన మోహిత్ శర్మ, 27 వికెట్లు తీసి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. పీఎల్ పర్ఫామెన్స్, దేశవాళీ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శన ఇచ్చినా కూడా మోహిత్ శర్మను సెలక్టర్లు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఐపీఎల్ 2024 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 73 పరుగులు ఇచ్చిన మోహిత్ శర్మ, ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు క్రియేట్ చేశాడు. దేశవాళీ టోర్నీల్లో హర్యానాకి ఆడే మోహిత్ శర్మ, సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్‌ని ప్రకటించాడు. 120 ఐపీఎల్ మ్యాచుల్లో 134 వికెట్లు తీసిన మోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ టీమ్స్‌కి ఆడాడు.