సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల అద్భుత ప్రదర్శనతోనే తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిందని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు.
మహమ్మద్ కైఫ్
సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల అద్భుత ప్రదర్శనతోనే తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిందని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. కోహ్లీ, రోహిత్‌లు విఫలమై ఉంటే టీమిండియా ఓటమిపాలయ్యేదని తెలిపాడు. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆదిలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్‌ను కోల్పోగా.. కోహ్లీ-రోహిత్ అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కోహ్లీ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ ఇద్దరి అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియా 349 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం సౌతాఫ్రికా బ్యాటర్లు విజయం కోసం ఆఖరి వరకు పోరాడారు. కానీ కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్‌తో జట్టుకు విజయాన్నందించారు. ఈ మ్యాచ్‌పై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన మహమ్మద్ కైఫ్.. కోహ్లీ, రోహిత్ లేకుంటే టీమిండియా ఓటమిపాలయ్యేదని తెలిపాడు.