అభిషేక్ వికెట్ ఇంపార్టెంట్: మార్‌క్రమ్

టీమిండియా సంచలనం అభిషేక్ శర్మపై సౌతాఫ్రికా కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడం తమ జట్టుకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తుందని, అయినప్పటికీ.. పొట్టి ఫార్మాట్‌లో టీమ్ఇండియా బలమైన జట్టని పేర్కొన్నాడు.

markram

ఐదెన్ మార్‌క్రమ్

టీమిండియా సంచలనం అభిషేక్ శర్మపై సౌతాఫ్రికా కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడం తమ జట్టుకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తుందని, అయినప్పటికీ.. పొట్టి ఫార్మాట్‌లో టీమ్ఇండియా బలమైన జట్టని పేర్కొన్నాడు. అభిషేక్ మ్యాచ్‌ విన్నర్ అని, అతడి వికెట్‌కు తమకు చాలా కీలకమైనదని తెలిపాడు. ‘నేను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో ఉన్నప్పుడు అభిషేక్‌తో కలిసి ఆడాను. అతను గొప్ప ప్లేయర్.. చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు. అతనొక మ్యాచ్ విన్నర్. నిర్భయంగా ఆడతాడు. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడటానికి స్వేచ్ఛ ఇవ్వడంతో అతను ఈ విధంగా ఆడుతున్నాడని అనిపిస్తోంది. అభిషేక్ వికెట్‌ మాకు చాలా కీలకమైనదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆరంభ ఓవర్లలోనే అతడి వికెట్‌ తీయడం ముఖ్యం. కొత్త తరం ఆటగాళ్లు సహజంగానే దూకుడుగా ఆడుతున్నారు. ఎందుకంటే ఇది వినోదం మాత్రమే కాదు. వివిధ లీగ్‌ల్లో ఆడటానికి అవకాశాలను తెచ్చిపెడుతుంది. తమ దేశం తరఫున టీ20 క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించడానికి ఉపకరిస్తుంది’ అని మార్‌క్రమ్ పేర్కొన్నాడు.


2026లో 27 సాధారణ సెలవులు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్