గంభీర్‌కు కోహ్లీ సోదరి చురకలు!

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దుమ్మురేపారు. తమ బ్యాటింగ్‌తోనే విమర్శకుల నోరు మూయించారు.

Kohli sister digs at Gambhir

ప్రతీకాత్మక చిత్రం

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దుమ్మురేపారు. తమ బ్యాటింగ్‌తోనే విమర్శకుల నోరు మూయించారు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటితే.. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ విజయానంతరం విరాట్ కోహ్లీ సోదరి భావన కోహ్లీ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫొటోను పంచుకున్న భావన కోహ్లీ.. క్యాప్షన్‌గా 'ఐవైకేవైకే' అని పేర్కొంది. తెలిసిన వారికి మాత్రమే అనే అర్థంలో ఈ పదాన్ని సోషల్ మీడియాలో ఉపయోగిస్తుంటారు. దాంతో గంభీర్‌ను ఉద్దేశించే భావన కోహ్లీ ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ, రోహిత్ ఆట గురించి గంభీర్‌కు అర్థమైందా? అని నేరుగా ప్రశ్నించకుండా ఇలా కోడ్ లాంగ్వేజ్‌‌లో పోస్ట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్