రాంచీ వన్డేలో కుర్రాడిలా చెలరేగిన విరాట్ కోహ్లీ ఖతర్నాక్ శతకంతో అభిమానులకు పూనకాలు తెప్పించాడు. 37 ఏళ్ల వయసులోనూ అప్పుడే జట్టులోకి వచ్చిన ఆటగాడిలా హుషారైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ భారత ఆటగాళ్లను సైతం ఉర్రూతలూగించాడు.
రాంచీ వన్డేలో కుర్రాడిలా చెలరేగిన విరాట్ కోహ్లీ ఖతర్నాక్ శతకంతో అభిమానులకు పూనకాలు తెప్పించాడు. 37 ఏళ్ల వయసులోనూ అప్పుడే జట్టులోకి వచ్చిన ఆటగాడిలా హుషారైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ భారత ఆటగాళ్లను సైతం ఉర్రూతలూగించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లకు దడపుట్టిస్తూ ఏడు సిక్సర్లతో కోహ్లీ సృష్టించిన విధ్వంసాన్ని మాజీలు వేనోళ్ల కొనియాడుతున్నారు. ఇక టీమిండియా స్టార్స్ అయితే కోహ్లీ సూపర్ సెంచరీకి తాము ఫిదా అయిపోయామని, ఆ ఇన్నింగ్స్ చూశాక ఓ తొమ్మిదేళ్లు వెనక్కి వెళ్లినట్టు అనిపించిందని చెబుతున్నారు. స్పిన్నర్ కుల్దీప్ మాట్లాడుతూ.. నా కెరీర్ కోహ్లీ కెప్టెన్సీలోనే మొదలైంది. రాంచీలో అతడు ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్ చూశాక నేను మరో 8-9 ఏళ్లు వెనక్కి వెళ్లినట్టు అనిపించింది. అవును.. 2017-18, 2019లో విరాట్ ఇలానే చెలరేగి ఆడేవాడు. రాంచీ వన్డేలో కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆసాంతం ఎంతో ఆత్మవిశ్వాసంగా కనిపించిన అతడి షాట్ సెలక్షన్ అమోఘం. అనుభవజ్ఞుడైన అతడి నుంచి చాలా విషయాలు నేర్చోకోవచ్చు. మైదానంలో కోహ్లీ ఉంటే ఆ ఎనర్జీయే వేరు అని అన్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌పై యువ ఆటగాడు తిలక్ వర్మ సైతం ప్రశంసలు కురిపించాడు. విరాట్ వన్డేల్లో ఆడిన గొప్ప ఇన్నింగ్స్‌లో రాంచీ సెంచరీ ఒకటని ఈ తెలుగు కుర్రాడు కితాబిచ్చాడు.