కెప్టెన్సీ ఇస్తేనే రాజస్థాన్‌కు!

కెప్టెన్సీ ఇస్తేనే రాజస్థాన్‌కు!

jadeja

రవీంద్ర జడేజా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ రిటెన్షన్ గడువు దగ్గర పడుతున్న తరుణంలో క్రికెట్ ప్రపంచంలో ఊహించని భారీ ట్రేడింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగబోయే మార్పిడి ఒప్పందంపై క్రీడావర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది. ఈ కీలక ఒప్పందంలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌కు పంపనుంది. అందుకు బదులుగా సీఎస్కే నుంచి స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, శామ్ కరన్‌లను రాజస్థాన్ రాయల్స్ తమ జట్టులోకి తీసుకోనుంది. క్రీడా వర్గాల ప్రకారం.. ఈ మూడు-మార్గాల ట్రేడింగ్ దాదాపుగా ఖరారైనట్లే. అయితే రాజస్థాన్ రాయల్స్‌కు తిరిగి వెళ్లేందుకు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఓ షరతు పెట్టినట్లు సమాచారం. రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలను తనకు అప్పగిస్తేనే ఈ ట్రేడింగ్ ఒప్పందానికి అంగీకరిస్తానని వెల్లడించినట్లు తెలిసనింది. ఈ షరతుతో రాజస్థాన్ యాజమాన్యం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ డీల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.


‘ఆర్జిత’ పెంపు ఆగింది!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్