భారత మహిళల హాకీ టీమ్ హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాలతో హరేంద్ర సింగ్ తప్పుకున్నట్లు హాకీ ఇండియా(హెచ్‌ఐ) ప్రకటించింది.
హరేంద్ర సింగ్
భారత మహిళల హాకీ టీమ్ హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాలతో హరేంద్ర సింగ్ తప్పుకున్నట్లు హాకీ ఇండియా(హెచ్‌ఐ) ప్రకటించింది. అంతర్జాతీయ క్వాలిఫైయర్స్‌కు సన్నదమవుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. వ్యక్తిగత కారణాలతోనే హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు హరేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు. 'భారత మహిళల హాకీ టీమ్‌కు కోచ్‌గా పనిచేయడం నా జీవితంలోనే అద్భుతమైన ఘట్టం. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నా.. నా హృదయం ఎప్పుడూ అమ్మాయిల జట్టుతోనే ఉంటుంది. వారి విజయాల కోసం పరితపిస్తోంది. హాకీ ఇండియాతో నా ప్రయాణాన్ని ఎప్పుడూ ఆరాదిస్తాను. భారత హాకీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వారు చేస్తున్న ప్రయత్నాలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.'అని ఆయన పేర్కొన్నారు. హరేంద్ర సింగ్ ప్రవర్తనపై జట్టులోని ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నారని, ఉన్నతాధికారులతో పాటు క్రీడా మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. హరేంద్ర సింగ్ పర్యవేక్షణలో ఆడలేమని కొందరు ఆటగాళ్లు బెదిరింపులకు దిగారని, దాంతోనే అతనిపై వేటు వేసారని ప్రచారం జరుగుతోంది.