ఇక సఫారీలతో కుస్తీ

ఇక సఫారీలతో కుస్తీ

test series 2025

ప్రతీకాత్మక చిత్రం

నేటి నుంచే టెస్ట్ సిరీస్ ప్రారంభం

కోల్‌కతా వేదికగా తొలి టెస్టు

ఉదయం 9:30కి మ్యాచ్ ప్రారంభం

టీమిండియా - దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. మొన్నటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై టి20 లు ఆడిన టీమిండియా, ఇప్పుడు ఫార్మాట్ మార్చబోతోంది. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్టులు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. స్వదేశంలోనే ఈ సిరీస్ నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టెస్ట్ సిరీస్‌ను జియో హాట్ స్టార్‌ ప్రసారం చేస్తోంది. 

ఇండియాను భయపెడుతున్న రికార్డులు

టీమిండియా - దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్‌ల రికార్డును పరిశీలిస్తే, ఇందులో సఫారీలు పై చేయి సాధించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు జ‌ట్ల‌ మధ్య 44 టెస్టు మ్యాచ్ లు జరిగాయి. ఇందులో టీమిండియా కేవలం 16 మ్యాచ్ లు మాత్రమే విజయం సాధించింది. అటు దక్షిణాఫ్రికా ఏకంగా 18 మ్యాచ్ లు విక్టరీ సాధించి లీడ్ లో ఉంది. ఇక హోమ్ టౌన్ లో దక్షిణాఫ్రికా పై 11 మ్యాచ్ ల‌లో టీమిండియా విజయం సాధించింది. అంటే విదేశాల్లో కేవలం ఐదు మ్యాచ్ ల‌లో టీమిండియా గెలవడం గ‌మ‌నార్హం. ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో నితీష్ కుమార్ రెడ్డి ఆడ‌టం లేద‌ని బీసీసీఐ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. దీంతో రేప‌టి మ్యాచ్ లో రిష‌బ్ పంత్‌, జురేల్ ఆడే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి.

జట్లు అంచనా:

ఇండియా: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్, వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, టెంబా బావుమా (కెప్టెన్), కైల్ వెర్రెయిన్ (వికెట్ కీప‌ర్), సెనురన్ ముత్తుసామి, కార్బిన్ బాష్, సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ.


‘ఆర్జిత’ పెంపు ఆగింది!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్