టీమిండియాకు 10 శాతం జరిమానా

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా భారత క్రికెట్ జట్టుకు జరిమానా పడింది.

2nd odi penalty

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా భారత క్రికెట్ జట్టుకు జరిమానా పడింది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (102), రుతురాజ్ గైక్వాడ్ (105) సెంచరీలతో చెలరేగినప్పటికీ, దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ వేస్తే, ప్రతి ఓవర్‌కు 5 శాతం జరిమానా విధిస్తారు. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు రెండు ఓవర్లు తక్కువగా వేసినట్లు ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ నిర్ధారించారు. కెప్టెన్ రాహుల్ తన తప్పిదాన్ని అంగీకరించి, ప్రతిపాదించిన జరిమానాకు సమ్మతించడంతో తదుపరి విచారణ అవసరం రాలేదు.


Daily Horoscope | ఈ రోజు రాశి ఫలాలు 9 డిసెంబర్ 2025
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్