విమర్శలను పట్టించుకోను: హర్షిత్ రాణా

ఇటీవల సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాధితుడు ఎవరంటే హర్షిత్ రాణా అని ఠక్కున చెప్పేస్తారు ఎవరైనా. ‘టాలెంట్ లేదు.. అనవసరంగా కొనసాగిస్తున్నారు? గౌతం గంభీర్ శిష్యుడు కాబట్టే అవకాశాలు’.. ఇలాంటి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడీ పేసర్.

harshit rana

హర్షిత్ రాణా

ఇటీవల సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాధితుడు ఎవరంటే హర్షిత్ రాణా అని ఠక్కున చెప్పేస్తారు ఎవరైనా. ‘టాలెంట్ లేదు.. అనవసరంగా కొనసాగిస్తున్నారు? గౌతం గంభీర్ శిష్యుడు కాబట్టే అవకాశాలు’.. ఇలాంటి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడీ పేసర్. ట్రోలింగ్‌ను మౌనంగా భరిస్తూనే మైదానంలో అదరగొడుతున్నాడు రానా. తాజాగా రాంచీ వన్ లో తొలి ఓవర్లోనే రెండు వికెట్లతో మ్యాచ్‌ను మలుపుతిప్పాడీ స్పీడ్‌స్టర్. తన బౌలింగ్ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్న ఈ పేసర్.. ఆన్‌లైన్‌లో తనపై వస్తున్న ట్రోలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను విమర్శలను పెద్దగా పట్టించుకోను. ఒకవేళ ఆన్‌లైన్‌లో నాపై వస్తున్న విమర్శలు.. కామెంట్లను తలలోకి ఎక్కించుకోను. ఎందుకంటే.. వాటిని బుర్రలో పెట్టుకుంటే నేను క్రికెట్ ఆడలేను. అందుకే.. సాధ్యమైనంతవరకూ విమర్శలను పట్టించుకోను. నేను మైదానంలో ఏం చేయగలను అనే విషయంపైనే దృష్టి సారిస్తాను. నా గురించి బయట ఏం అనుకుంటున్నారు అనేది నాకు అనవసరం. నేను కష్టపడేతత్వాన్నే నమ్ముకుంటాను. మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే ఫోకస్ పెడుతాను’ అని వెల్లడించాడు.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్