వివాదంలో హర్షిత్ రాణా

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ హర్షిత్ రాణా వివాదంలో చిక్కుకున్నారు. మైదానంలో తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ప్రత్యర్థి ఆటగాడిపై నోరు పారేసుకున్నారు.

harshit Rana

హర్షిత్ రాణా

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ హర్షిత్ రాణా వివాదంలో చిక్కుకున్నారు. మైదానంలో తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ప్రత్యర్థి ఆటగాడిపై నోరు పారేసుకున్నారు. సౌతాఫ్రికాతో రాంచీ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 135) సెంచరీతో సత్తా చాటడంతో భారత్ 17 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ ఔటైన తర్వాత హర్షిత్ రాణా, విరాట్ కోహ్లీ చేసుకున్న సంబరాలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా హర్షిత్ రాణా ప్రత్యర్థి ఆటగాడి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ సెండాఫ్ ఇవ్వగా.. అతనికి కోహ్లీ వత్తాసు పలికాడు. యువ ఆటగాడైన బ్రెవిస్ పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు. ఐసీసీ రూల్స్ ప్రకారం బ్యాటర్ ఔటైన తర్వాత అతిగా ప్రవర్తించడం నేరం.ఇప్పటికే ఐపీఎల్‌లో ఫ్లయింగ్ కిస్ సెలెబ్రేషన్స్‌తో హర్షిత్ రాణా ఓ మ్యాచ్‌లో నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ బ్యాటర్లను రెచ్చగొట్టేలా అసభ్యకర సైగలు చేస్తున్నాడు. తాజా ఘటనతో హర్షిత్ రాణాపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్