హార్దిక్ పాండ్యా విధ్వంసం!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దుమ్మురేపాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సన్నాహకంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్న హార్దిక్ పాండ్యా తన తొలి మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.

hardik pandya

హార్దిక్ పాండ్యా

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దుమ్మురేపాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సన్నాహకంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్న హార్దిక్ పాండ్యా తన తొలి మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులతో అజేయంగా నిలిచి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఆసియా కప్ 2025 సందర్భంగా గాయపడ్డ హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనతో పాటు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న అతను మ్యాచ్ ఫిట్‌నెస్ కోసం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున బరిలోకి దిగాడు. పంజాబ్‌తో మంగళవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో బరోడా విజయంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో బరోడా 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్