షమీ, వరుణ్ చక్రవర్తిని తీసుకోలేదెందుకు?: హర్భజన్

టీమిండియా స్టార్ పేసర్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీలను ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు.

Harbhajan Singh

హర్భజన్ సింగ్

టీమిండియా స్టార్ పేసర్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీలను ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయ బౌలర్లను కనుగొనాలని సూచించాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమికి బౌలింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని చెప్పాడు. బుమ్రా లేకుంటే భారత బౌలింగ్ బలహీనంగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయడంపై దృష్టిసారించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. 'ఇంగ్లండ్ పర్యటనలో జస్‌ప్రీత్ బుమ్రా లేకపోయినా మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించాడు. బుమ్రా ఆడని మ్యాచ్‌లను కూడా భారత్ గెలిచింది. కానీ వన్డేలు, టీ20ల్లో మాత్రం ఫలితం భిన్నంగా ఉంటుంది. ఈ ఫార్మాట్లలో కూడా బుమ్రాకు ప్రత్యామ్నాయ బౌలర్లను కనుగొనాలి. అది స్పిన్నర్ అయినా పేసర్ అయినా వికెట్లు తీయగల బౌలర్‌ను గుర్తించాలి. ఇప్పటికే జట్టులో కుల్దీప్ యాదవ్ స్పిన్నర్‌గా ఉన్నాడు. అతనికి తోడుగా వరుణ్ చక్రవర్తిని కూడా జట్టులోకి తీసుకురావాలి'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఆఖరి వన్డే శనివారం వైజాగ్ వేదికగా జరగనుంది.


టీమిండియాకు 10 శాతం జరిమానా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్