టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. క్రికెట్ పిచ్‌ల రేటింగ్ విధానంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య పెర్త్‌లో జరిగిన యాషెస్ టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడం, ఆ పిచ్‌కు ఐసీసీ 'వెరీ గుడ్' రేటింగ్ ఇవ్వడంపై ఆయన ఘాటుగా స్పందించారు.
సునీల్ గవాస్కర్
టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. క్రికెట్ పిచ్‌ల రేటింగ్ విధానంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య పెర్త్‌లో జరిగిన యాషెస్ టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడం, ఆ పిచ్‌కు ఐసీసీ 'వెరీ గుడ్' రేటింగ్ ఇవ్వడంపై ఆయన ఘాటుగా స్పందించారు. పేస్, బౌన్స్‌కు అనుకూలించే పిచ్‌లను గొప్పవిగా, స్పిన్‌కు అనుకూలించే ఉపఖండంలోని పిచ్‌లను నాసిరకమైనవిగా చూసే ద్వంద్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. 2025-26 యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. అయినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ పిచ్‌కు అత్యుత్తమ రేటింగ్ అయిన 'వెరీ గుడ్' అని కితాబునిచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆడిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం ఆ పిచ్ 'చెత్తగా' ఉందంటూ తీవ్ర విమర్శలు చేశాడు. తొలిరోజే 19 వికెట్లు పడటం, చాలా మంది ఆటగాళ్లు గాయపడటమే దీనికి నిదర్శనమని అన్నారు. ఈ నేపథ్యంలో గవాస్కర్.. ‘పేస్, బౌన్స్‌తో ప్రాణాలకు ప్రమాదకరంగా ఉండే పిచ్‌లను ఎప్పుడూ చెడ్డవిగా చూడరు. అదే ఉపఖండంలో బంతి తిరిగితే మాత్రం దాన్ని అవమానంగా పరిగణిస్తారు. ఇది పాత క్రికెట్ శక్తుల కథనం’ అని మండిపడ్డారు.