గంభీర్, రోహిత్ మధ్య తీవ్ర వాగ్వాదం!

సౌతాఫ్రికాతో తొలి వన్డే తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర వాగ్వాదం జరిగింది

Gambhir rohit

గంభీర్, రోహిత్

సౌతాఫ్రికాతో తొలి వన్డే తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గంభీర్ ఏదో చెబుతుండగా.. 

అందుకు రోహిత్ విభేదిస్తూ ఉండటం వీడియోలో కనిపించింది. సుదీర్ఘంగా సాగిన ఈ సంభాషణ టీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా.. అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా కొత్త చర్చను హ్యాష్ ట్యాగ్స్‌ను ట్రెండ్ చేస్తోంది. భారత విజయానంతరం టీవీ కెమెరాలు.. డ్రెస్సింగ్ రూమ్‌ను జూమ్ చేసి చూపించాయి. ఆ సమయంలో గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ మధ్య ఏదో వాగ్వాదం జరిగింది. గంభీర్ మాటలకు వ్యతిరేకంగా రోహిత్ తల ఊపుతూ కనిపించాడు. ఈ సంభాషణ సందర్భంగా ఇద్దరూ సీరియస్‌గా ఉన్నారు. అయితే వారి మధ్య జరిగిన సంభాషణ గురించి క్లారిటీ లేదు. కానీ జట్టు గురించి ఇద్దరి మధ్య హాట్ డిబేట్ జరిగిందనే వాదన వినిపిస్తోంది. టీమ్ వ్యూహాలు, భావోద్వేగాలు, జట్టు సెలెక్షన్ గురించి, సోషల్ మీడియాలో వచ్చే విమర్శల గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు రోహిత్, కోహ్లీ భవితవ్యం గురించి మాట్లాడుకున్నారని కామెంట్ చేస్తున్నారు. గంభీర్, రోహిత్ మధ్య సంభాషణ గురించి క్లారిటీ లేనప్పటికీ.. వారి బాడీ లాంగ్వేజ్ చూస్తే చర్చ వేడిక్కిందనే విషయం అర్థమవుతుంది.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్