500 రన్స్ కూడా సరిపోవు: క్రిష్ శ్రీకాంత్

భారత బౌలర్లపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమికి పేలవ బౌలింగే కారణమని చెప్పాడు.

kris srikkanth

కృష్ణమాచారి శ్రీకాంత్ 

భారత బౌలర్లపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమికి పేలవ బౌలింగే కారణమని చెప్పాడు. ఇలా బౌలింగ్ చేస్తే 500 పరుగులు చేసినా సరిపోవని అభిప్రాయపడ్డాడు. బుమ్రా గైర్హాజరీలో టీమిండియా రాణించలేకపోతుందని, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ నిలకడగా రాణించలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు. తాజా ఫలితంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్.. తమిళ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని వన్డేల్లో ఎందుకు ఆడించడం లేదని ప్రశ్నించాడు. 'మరో 20 పరుగులు చేయాల్సింది అనడం దురాశే. 358 పరుగులకు మించి ఏం కావాలి. ఇంకా 20 పరుగులు చెయాల్సిందని అంటే.. 500 పరుగులు కూడా సరిపోవు. భారత ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కేఎల్ రాహుల్ చివర్లో గొప్పగా ఆడి విలువైన పరుగులు అందించాడు. 27 బంతులాడిన జడేజా కూడా 30-35 పరుగులు చేసుంటే భారత్ మరో 10 పరుగులు అదనంగా చేసిది. అయితా 358 భారీ స్కోర్. మంచు టీమిండియా అవకాశాలను దెబ్బతీసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అదనంగా 10 పరుగులు చేస్తే బాగుండేది. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ బాగా ఆడితే గెలిచేది అనుకోవడం సరికాదు'అని చెప్పుకొచ్చాడు.


టీమిండియాకు 10 శాతం జరిమానా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్