రోహిత్ ఆడినప్పుడు నేను స్కూల్‌లో ఉన్నా: బవుమా

భారత్‌తో జరగనున్న రెండో వన్డేకు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న సమయంలో తాను ఇంకా పాఠశాలలో చదువుకుంటున్నానని గుర్తు చేసుకున్నాడు.

Temba Bavuma

తెంబా బవుమా 

భారత్‌తో జరగనున్న రెండో వన్డేకు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న సమయంలో తాను ఇంకా పాఠశాలలో చదువుకుంటున్నానని గుర్తు చేసుకున్నాడు. తొలి వన్డేకు దూరమైన బవుమా, రాయ్‌పూర్ వేదికగా బుధవారం జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. నిర్వహించిన మీడియా సమావేశంలో బవుమా మాట్లాడుతూ.. రోహిత్, విరాట్ కోహ్లీ రాకతో భారత జట్టు మరింత బలోపేతమైందని అంగీకరించాడు. అయితే, వారిని ఎదుర్కోవడం తమకు కొత్తేమీ కాదని స్పష్టం చేశాడు. కోహ్లీ, రోహిత్ ప్రపంచ స్థాయి ఆటగాళ్లని, అయినా వారితో తాము చాలా మ్యాచ్‌లు ఆడామని తెలిపారు. కొన్నిసార్లు తాము పైచేయి సాధించామన్నారు. ఈ సవాళ్లు సిరీస్‌ను మరింత ఉత్తేజకరంగా మారుస్తాయని బవుమా వివరించాడు. 


టీమిండియాకు 10 శాతం జరిమానా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్