టీమిండియా స్టార్ ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 19 బంతుల్లోపు 7 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
అభిషేక్ శర్మ
టీమిండియా స్టార్ ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 19 బంతుల్లోపు 7 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ తరఫున 18 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 పరుగులు చేసి లింబానీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. గత ఆదివారం బరోడాతో జింఖాన మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ భారీ శతకంతో చెలరేగాడు. 52 బంతుల్లో 148 పరుగులు చేశాడు. అదే జోరును తాజా మ్యాచ్‌లోనూ చూపించాడు. టీ20ల్లో అభిషేక్ శర్మకు 19 బంతుల్లోపు ఇది ఏడో హాఫ్ సెంచరీ. అయితే ఇందులో మూడు హాఫ్ సెంచరీ పంజాబ్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపీలోనే నమోదు కాగా.. మరో మూడు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున వచ్చాయి.