ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్దమైంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఈ మినీ ఆక్షన్ జరగనుంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా 10 జట్లలో 77 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్దమైంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఈ మినీ ఆక్షన్ జరగనుంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా 10 జట్లలో 77 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 77 స్థానాల కోసం 1355 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో రూ.2 కోట్ల కనీస ధరతో 45 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు 10 జట్లకు అందించారు. పది ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేయనున్నాయి. డిసెంబర్ 5 నాటికి తమ షార్ట్ లిస్ట్ జాబితాను ఫ్రాంచైజీలు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అందజేయాల్సి ఉంటుంది. 10 ఫ్రాంచైజీల షార్ట్ లిస్ట్ జాబితాల నుంచి నిర్వాహకులు తుది జాబితాను సిద్దం చేసి వేలం వేస్తారు. ప్రతీ జట్టు గరిష్టంగా 25 మంది కనిష్టంగా 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోనున్నాయి. ఈ 77 మందిలో విదేశీ ఆటగాళ్లకు 31 స్లాట్స్ ఉన్నాయి. రస్సెల్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కోచ్‌గా అవతారమెత్తగా.. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఈసారి వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు.