మొబైల్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. కొత్తగా తయారయ్యే మొబైల్ ఫోన్లలో కేంద్రం ప్రభుత్వం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్‌ను డిఫాల్ట్‌గా అందించాలని సూచించింది.
సంచార్ సాథీ యాప్
తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు
యాప్ ఇన్‌స్టాలేషన్‌కు 90 రోజులు గడువు
న్యూఢిల్లీ: మొబైల్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. కొత్తగా తయారయ్యే మొబైల్ ఫోన్లలో కేంద్రం ప్రభుత్వం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్‌ను డిఫాల్ట్‌గా అందించాలని సూచించింది. సైబర్ నేరాలు, చోరీలు వంటివి అరికట్టేందుకు, పోయిన మొబైళ్లను గుర్తించేందుకు వీలుగా సంచార్ సాథీ యాప్‌ను కేంద్రం రూపొందించింది. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా తయారయ్యే మొబైల్ ఫోన్లలో యాప్ ఇన్‌స్టలేషన్ అమలుకు మొబైల్ కంపెనీలకు కేంద్రం 90 రోజులు గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ యాప్ సహాయంతో ఇప్పటి వరకు ఏకంగా 7 లక్షలకు పైగా చోరీకి గురైన ఫోన్లను కేంద్రం గుర్తించింది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ , సిటిజెన్-సెంట్రిక్ డిజిటల్ సేఫ్టీ ప్లాట్‌ఫామ్‌లో బ్లాక్ యువర్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ హ్యాండ్‌సెట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.