వడ్డీ రేట్లు తగ్గే చాన్స్ ...ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు...

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మానిటరీ పాలసీ కమిటీ భేటీలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్ర సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మాక్రో ఎకనామిక్స్ డాటా ప్రకారం చూసినట్లయితే రిపోరేట్స్ తగ్గించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని అయితే దీనిపై తుది నిర్ణయం మానిటరీ పాలసీ కమిటీ భేటీలో తీసుకుంటామని పేర్కొన్నారు.

Sanjay Malhotra

సంజయ్ మల్హోత్ర

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మానిటరీ పాలసీ కమిటీ భేటీలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్ర సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మాక్రో ఎకనామిక్స్ డాటా ప్రకారం చూసినట్లయితే రిపోరేట్స్ తగ్గించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని అయితే దీనిపై తుది నిర్ణయం మానిటరీ పాలసీ కమిటీ భేటీలో తీసుకుంటామని పేర్కొన్నారు. మానిటరీ పాలసీ కమిటీ భేటీ డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 5 తేదీల మధ్యలో జరగనుంది. అక్టోబర్ నెలలో చివరిసారి మానిటరీ పాలసీ కమిటీ భేటీ జరగగా భవిష్యత్తులో రెపోరేట్ తగ్గింపునకు అవకాశం ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్న సంగతి గుర్తుంచుకోవాలి. నిజానికి అక్టోబర్ నెలలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం వచ్చిన డేటాలో ద్రవ్యోల్బణం, అలాగే ఇతర ఆర్థిక డేటాకు సంబంధించి ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. నిజానికి అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం 0.25% కు పడిపోయింది. ఇది రికార్డు స్థాయి కనిష్ఠమని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే ఫిబ్రవరి నుండి జూన్ 2025 మధ్య కాలంలో మానిటరీ పాలసీ కమిటీ భేటీలో ఇప్పటికే 100 బేసిస్ పాయింట్లు రేపో రేట్ తగ్గించారు. ప్రస్తుతం రెపోరేటు 5.50 శాతం వద్ద ఉంది. డిసెంబర్ నెలలో మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని తద్వారా రేపోరేట్ 5.25 శాతానికి తగ్గించే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మరో కీలకమైన వ్యాఖ్య సైతం చేశారు. అందులో ప్రధానంగా భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గింపు జరుగుతుందా లేదా అనే ప్రశ్నపై స్పందిస్తూ ఆర్బిఐ ఏదైనా ఒక పాలసీ నిర్మాణం తీసుకుంది అంటే అది పూర్తిగా దూకుడుగాను అలా అని రక్షణాత్మకంగా కానీ ఉండదని అవసరాన్ని బట్టి తాము ఆల్రౌండర్ లాగా పని చేస్తామని తమ ప్రధాన ఉద్దేశం ధరల స్థిరత్వం లక్ష్యంగా పనిచేస్తామని అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా తమ లక్ష్యాల్లో ప్రాధాన్యం ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక రూపాయి విలువ పతనం పైన స్పందిస్తూ ప్రతి సంవత్సరం రూపాయి విలువ 3 నుంచి 3.5% మధ్యలో తగ్గుతూ ఉంటుందని, అయితే రూపాయిని స్థిరంగా సాఫీగా కదిలేలా చూడటం ఆర్బీఐ లక్ష్యాల్లో ఒకటి అని వివరించారు. ఇక మైక్రో స్మాల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కి సంబంధించి ఈ విభాగంలో రుణాల ఒత్తిడి తక్కువగానే ఉందని ఈ స్థితి మెరుగవుతుందని వెల్లడించారు.


మా వల్ల కాదు!... ఐసీసీకి జియోహాట్‌స్టార్ షాక్..
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్