ఐఏఎస్ అర్వింద్‌ను విచారించొచ్చా?... అనుమతి ఇవ్వాలని డీఓపీటీకి సీఎస్ లేఖ....

ఫార్ములా ఈ-రేసు ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు బుధవారం కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణా శాఖ (డీవోపీటీ)కి లేఖ రాశారు.

Arvind Kumar

ఐఏఎస్ అర్వింద్‌

అనుమతి రాగానే ఏసీబీ చార్జిషీట్!

హైదరాబాద్, డిసెంబర్ 3 (ఈవార్తలు: ఫార్ములా ఈ-రేసు ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు బుధవారం కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణా శాఖ (డీవోపీటీ)కి లేఖ రాశారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ఏసీబీ ఆయనపై చార్జ్‌షీటు దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2023లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహణకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్ల నిధులు విదేశీ సంస్థకు విడుదల చేయడంపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. కాగా, ఇదే కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిగా ఉన్నారు. అయితే, గతంలో హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పనిచేసిన అరవింద్ కుమార్ కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా, ఎన్నికల కోడ్ అమలుల్లో ఉండగా నిధులను మళ్ళించడంలో కీలక పాత్ర పోషించారని ఏసీబీ ఆరోపిస్తోంది. దేశంలో ఐఏఎస్ అధికారులపై కేసు విచారణ, అభియోగాలు నమోదు చేసేందుకు ముందుగా కేంద్రంలోని డీవోపీటీ నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి తప్పనిసరి కావడంతో సీఎస్ రామకృష్ణా రావు తాజాగా లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్