రాజ్‌భవన్ ఇక లోక్‌భవన్

రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

raj bhavan renames as lok bhavan

లోక్‌భవన్‌

పేర్లు మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, డిసెంబర్ 2 (ఈవార్తలు): రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాజ్‌భవన్‌లను లోక్‌భవన్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. వలసవాద వాసనలను తుడిచిపెట్టే ఉద్దేశంలో భాగంగా, రాజ్‌భవన్, రాజ్‌నివాస్‌ పేర్లను లోక్‌భవన్, లోక్‌నివాస్‌గా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్లకు సూచిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. అందుకు అనుగుణంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అసోం, కేరళ, త్రిపుర, ఒడిశా తదితర రాష్ట్రాలు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశాయి


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్