లాబీ కండువా కప్పుకొని, సింహాసనంపై కూర్చొని ఉన్న కేసీఆర్ విగ్రహం వద్ద ఓ కుక్క మొరుగుతున్నట్లు ఉన్న ఏఐ ఫొటోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కేసీఆర్
విగ్రహం వద్ద మొరుగుతున్నట్లు ఇమేజ్
ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 7 (ఈవార్తలు): గులాబీ కండువా కప్పుకొని, సింహాసనంపై కూర్చొని ఉన్న కేసీఆర్ విగ్రహం వద్ద ఓ కుక్క మొరుగుతున్నట్లు ఉన్న ఏఐ ఫొటోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోకు ఐవైకేవైకే (తెలిసినవాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు) అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేటీఆర్ ఈ ఫొటోను ఇప్పుడు ఎందుకు పంచుకున్నారు? ఈ క్యాప్షన్ వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? అంటూ నెటిజన్లు రకరకాల ఊహాగానాలతో కామెంట్లు చేస్తున్నారు. కొందరు రాజకీయ కోణంలో విశ్లేషిస్తుండగా, మరికొందరు తమకు తోచిన విధంగా అర్థాలు చెబుతున్నారు. మొత్తానికి, ఎలాంటి వివరణ లేకుండా కేటీఆర్ పెట్టిన ఈ ఒక్క పోస్ట్ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్రమైన క్యూరియాసిటీని రేకెత్తించింది. దీనిపై నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. ‘కేసీఆర్ మహా శిఖరం అని, కుక్కలా మొరిగితే ఏం ప్రయోజనం ఉండదు’ అన్నట్లుగా ఈ ఫొటో ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.