దేవుడా.. ఏందీ షాకింగులు!.. 2023లో... 2025లో అదే పెట్టుబడి...

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడులపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవుడా, షాకింగ్ అన్న వ్యాఖ్యలు వాడుతూ.. సమ్మిట్‌లో ప్రకటించిన పెట్టుబడులపై పలు సంచలన విషయాలు వెల్లడించారు.

krishank

 మన్నె క్రిశాంక్

స్ట్రైక్ ఆఫ్ చేసిన కంపెనీ రూ.4,650 కోట్లా?

ఆర్నెల కింద పుట్టిన కంపెనీ 4 వేల కోట్లా?

గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులపై క్రిశాంక్ విమర్శలు

హైదరాబాద్, డిసెంబర్ 8 (ఈవార్తలు): తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడులపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవుడా, షాకింగ్ అన్న వ్యాఖ్యలు వాడుతూ.. సమ్మిట్‌లో ప్రకటించిన పెట్టుబడులపై పలు సంచలన విషయాలు వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా.. ‘ 2023లో చేసిన పెట్టుబడి ప్రకటనను మళ్లీ ప్రకటిస్తున్నారు. ఎంపీల్ లాజిస్టిక్స్ కంపెనీ 17 జూలై 2023న రూ.750 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఐఏఎస్ జయేశ్ రంజన్ ప్రారంభించారు. అదే రూ.750 కోట్ల పెట్టుబడి ప్రకటనను గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ సమ్మిట్‌లో మళ్లీ ప్రకటించారు. స్ట్రైక్ ఆఫ్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి ( జానారెడ్డి కుమారుడు) కంపెనీ రూ.4650 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రకటన చేయడం షాకింగ్‌. జూలై 2025లో కేవలం రూ.10 లక్షలతో మాదాపూర్‌లో మొదలైన కంపెనీ నేడు రూ.4000 కోట్ల పెట్టుబడి ప్రకటించింది.. దేవుడా!’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్