తెలంగాణ ఉద్యమానికి పునాది పడింది పాల్వంచలోనే. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. 60 ఏళ్ల స్వరాష్ట్ర కలను తీర్చింది ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్. మన్మోహన్ సింగ్ పేరును వర్శిటీకి పెట్టుకోవడం గర్వకారణం.
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ కలను తీర్చింది మన్మోహన్
ఆయన పేరే ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి
కొత్తగూడెంలో సీఎం రేవంత్ వెల్లడి
తెలంగాణ ఉద్యమానికి పునాది పడింది పాల్వంచలోనే. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. 60 ఏళ్ల స్వరాష్ట్ర కలను తీర్చింది ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్. మన్మోహన్ సింగ్ పేరును వర్శిటీకి పెట్టుకోవడం గర్వకారణం. దేశంలో ఉన్న ఏకైక ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్‌సింగ్ పేరు పెట్టాం. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలే ప్రపంచపటంలో తెలంగాణను నిలబెడుతున్నాయి
- సీఎం రేవంత్ రెడ్డి
కొత్తగూడెం, డిసెంబర్ 2 (ఈవార్తలు): ఖమ్మం జిల్లా గత పదేళ్లు పడావు పడిందని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను తాము పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తగూడెంలో మాజీ ప్రధాని డాక్టర్ న్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి శంకుస్థాపన అనంతరం సీఎం సభలో మాట్లాడారు. తెలంగాణ సాకారం చేసిన మన్మోహన్ సింగ్ పేరును దేశంలో ఉన్న ఏకైక ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి పెట్టుకోవడం గర్వకారణమని అన్నారు. కీలకమైన మంత్రి పదవులు ఖమ్మం జిల్లా నేతల దగ్గరే ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి పునాది పడింది పాల్వంచలోనేనని తెలిపారు. 60 ఏళ్ల స్వరాష్ట్ర కలను తీర్చింది ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ అని కొనియాడారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలే ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెడుతున్నాయని వివరించారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల కోరారని గుర్తు చేశారు. ఖమ్మం మంత్రుల చేతుల్లోనే పాలనకు ఆయువుపట్టయిన శాఖలు ఉన్నాయని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. పథకాలు అందాలంటే సర్పంచ్‌లు మంచివాళ్లు ఉండాలని పేర్కొన్నారు. దేశంలోనే అత్యున్నతమైన వర్సిటీ ఇదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎర్త్ సైన్సెస్ వర్సిటీ అనేది దేశంలో ఎక్కడా లేదని అన్నారు. అద్భుతమైన వర్సిటీకి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని, మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ దేశానికే తలమానికమని కొనియాడారు. వీలైనంత త్వరగా వర్సిటీ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ సైన్సెస్ వర్సిటీ ఇచ్చిన ముఖ్యమంత్రికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని కొనియాడారు. గత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ పేరుతో ఒక్క పథకం కూడా పెట్టలేదని విమర్శించారు. మీ దీవెనలు ఇందిరమ్మ ప్రభుత్వంపై ఎప్పుడూ ఉండాలని కోరారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్న ఎర్త్ సైన్సెస్ వర్సిటీ భూవిజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు ఊతమివ్వనున్న వర్సిటీ స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు.
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 4 వేల మందికిపైగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఖర్గే, రాహుల్ గాంధీలకు ఆహ్వానం పలికిన తర్వాత ఆయన బుధవారం మధ్యాహ్నానికి హైదరాబాద్ కు తిరిగి వస్తారని సమాచారం