హైదరాబాద్‌లోని కీలక రోడ్లకు ప్రముఖ వ్యక్తులు, సంస్థల పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవుటర్ రింగ్ రోడ్డు వద్ద రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు వంద మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించారు.
ప్రతీకాత్మక చిత్రం
పలు కీలక రోడ్లకు ప్రముఖుల పేర్లు
తుది నిర్ణయానికి కేంద్రానికి లేఖ
హైదరాబాద్, డిసెంబర్ 7 (ఈవార్తలు): హైదరాబాద్‌లోని కీలక రోడ్లకు ప్రముఖ వ్యక్తులు, సంస్థల పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవుటర్ రింగ్ రోడ్డు వద్ద రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు వంద మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించారు. రావిర్యాల ఇంటర్ ఛేంజ్‌కు ఇప్పటికే టాటా ఇంటర్‌చేంజ్ అని పేరు పెట్టారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచే వెళ్లే ప్రధాన రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. తుది నిర్ణయం కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి ప్రభుత్వం లేఖలు రాయనుంది. ఐటీ కారిడార్‌లో ముఖ్యమైన రోడ్లకు గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితవ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వటంతో పాటు, హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ఆ రోడ్లపై ప్రయాణించే వారికి కూడా స్ఫూర్తిమంతంగా ఉంటుందనే ఉద్దేశంతో సీఎం ఈ ప్రతిపాదన చేశారు.