పవన్ సినిమాలు ఆడనివ్వం

గోదావరి జిల్లాలపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.

Balmoor Venkat
బల్మూరి వెంకట్

సిగ్గుంటే ఆంధ్రాలోనే ఉండాలి

తెలంగాణకొస్తే తరిమికొడతాం

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

హైదరాబాద్, డిసెంబర్ 1 (ఈవార్తలు): గోదావరి జిల్లాలపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ కల్యాణ్‌పై ఇప్పటికే ఫైర్ అయ్యారు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పందించారు. పవన్ కల్యాణ్‌కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలని హితవు పలికారు. తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతామని హెచ్చరించారు. ఇక నుంచి పవన్ కల్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని పిలుపునిచ్చారు. గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టం అని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే బలుపుతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్