రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత వేములవాడలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ప్రతీకాత్మక చిత్రం
వేములవాడ, డిసెంబర్ 2 (ఈవార్తలు): రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత వేములవాడలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు ఆసుపత్రులలో ఏ మేరకు అమలు అవుతున్నాయో తెలుసుకొనేందుకు ఆమె.. ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరును డీఎంహెచ్‌ఓ సమీక్షించారు. ముఖ్యంగా, డాక్టర్ల పేర్లు, ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది వివరాలు, రోగులకు అందించే వైద్య సేవల ధరల వివరాల నమోదు వంటివి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించారు