1.88 లక్షల కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025' మొదటి రోజున భారీగా అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయి. రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, ఫ్యూచర్ సిటీలో జరిగిన ఈ సదస్సులో వివిధ కంపెనీలతో రూ.1.88 లక్షల కోట్ల మేర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది.

telamgana global summit

ప్రతీకాత్మక చిత్రం

గ్లోబల్ సమ్మిట్ తొలిరోజే భారీ ఒప్పందాలు

డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు

హైదరాబాద్, డిసెంబర్ 8 (ఈవార్తలు): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025' మొదటి రోజున భారీగా అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయి. రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, ఫ్యూచర్ సిటీలో జరిగిన ఈ సదస్సులో వివిధ కంపెనీలతో రూ.1.88 లక్షల కోట్ల మేర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ సహా వివిధ రంగాల్లో ఆయా కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. డీప్ టెక్నాలజీ రంగంలో రూ.75 వేల కోట్లు, గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.27 వేల కోట్లు, పునరుత్పాదక రంగంలో రూ.39,700 కోట్లు, ఏరోస్పోస్, డిఫెన్స్ రంగాల్లో రూ.19,350 కోట్లు, ఏవియేషన్ రంగంలో జీఎంఆర్ గ్రూపుతో రూ.15 వేల కోట్లు, తయారీ రంగంలో రూ.13,500 కోట్లు, ఉక్కు రంగంలో రూ.7 వేల కోట్లు, టెక్స్‌టైల్స్ రంగంలో రూ.4 వేల కోట్ల మేర ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ట్రంప్ మీడియా లక్ష కోట్లు

ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సదస్సు వేదికగా కంపెనీ డైరెక్టర్ ఎరిక్ ఈ విషయాన్ని ప్రకటించారు. రానున్న పదేళ్లలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

వంతారా కీలక ఒప్పందం

రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ నేతృత్వంలోని వంతారా బృందం రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఎంవోయూ కదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో జూపార్క్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో వంతారా డీల్ కుదుర్చుకుంది. సీఎం రేవంత్ సమక్షంలో అటవీశాఖతో వంతారా టీమ్ ఎంవోయూ చేసుకుంది. గుజరాత్‌లోని వంతారాలో ఉండే సదుపాయాలన్నీ ఫ్యూచర్ సిటీలో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.

మైహోమ్  రూ.7 వేల కోట్ల పెట్టుబడులు

ఈ గ్లోబల్ సమ్మిట్‌లో  మైహోమ్ పవర్ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.  మైహోమ్ పవర్ సంస్థ రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటుంది. దీని వల్ల 12,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇంకా మరికొన్ని సంస్ధలు పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నాయి.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్