2026 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ మరియు ఐచ్ఛిక సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తంగా 27 సాధారణ సెలవులు, 26 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రతీకాత్మక చిత్రం
26 ఐచ్ఛిక సెలవులు: టీజీ సర్కార్
హైదరాబాద్, డిసెంబర్ 8 (ఈవార్తలు): 2026 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ మరియు ఐచ్ఛిక సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తంగా 27 సాధారణ సెలవులు, 26 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన సాధారణ సెలవుల్లో భోగి, సంక్రాంతి, గణతంత్ర్య దినోత్సవం, మహాశివరాత్రి, హోలి, ఉగాది, రంజాన్, శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, బాబు జగ్జీవన్ రామ్ జయంతి, డాక్టర్ అంబేడ్కర్ జయంతి, బక్రీద్, మొహర్రం, బోనాలు, స్వాతంత్ర్య దినోత్సవం, ఈద్ మిలాద్ ఉన్ నబీ, శ్రీ కృష్ణాష్టమి, వినాయక చవితి, మహాత్మా గాంధీ జయంతి, సద్దుల బతుకమ్మ, విజయ దశమి, దీపావళి, కార్తీక పౌర్ణమి, క్రిస్‌మస్ ఉన్నాయి. రంజాన్, విజయదశమి, క్రిస్‌మస్ పండుగల మరుసటి రోజు కూడా సాధారణ సెలవుగా ప్రకటించింది.
సాధారణ సెలవులు:
1. భోగి (14-01-2026)
2. సంక్రాంతి (15-01-2026)
3. గణతంత్ర దినోత్సవం (26-01-2026)
4. మహాశివరాత్రి (15-02-2026)
5. హోలీ (03-03-2026)
6. ఉగాది (19-03-2026)
7. ఈదుల్ ఫితర్ (రంజాన్) (21-03-2026)
8. రంజాన్ అనంతర రోజు (22-03-2026)
9. శ్రీరామ నవమి (27-03-2026)
10. గుడ్ ఫ్రైడే (03-04-2026)
11. బాబు జగ్జీవన్ రామ్ జయంతి (05-04-2026)
12. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి (14-04-2026)
13. ఈదుల్ అజ్హా (బక్రీద్) (27-05-2026)
14. షహాదత్ ఇమామ్ హుస్సేన్ (రజా) – 10వ మొహర్రం (26-06-2026)
15. బోనాలు (10-08-2026)
16. స్వాతంత్ర్య దినోత్సవం (15-08-2026)
17. ఈద్ మిలాద్ ఉన్ నబీ (26-08-2026)
18. శ్రీకృష్ణాష్టమి (04-09-2026)
19. వినాయక చవితి (14-09-2026)
20. మహాత్మా గాంధీ జయంతి (02-10-2026)
21. సద్దుల బతుకమ్మ (18-10-2026)
22. విజయ దశమి / దసరా (20-10-2026)
23. విజయదశమి అనంతర రోజు (21-10-2026)
24. దీపావళి (08-11-2026)
25. కార్తీక పౌర్ణమి / గురునానక్ జయంతి (24-11-2026)
26. క్రిస్మస్ (25-12-2026)
27. క్రిస్మస్ అనంతర రోజు (బాక్సింగ్ డే) (26-12-2026)
ఐచ్చిక సెలవులు – 2026
1. న్యూఇయర్ (01-01-2026)
2. హజ్రత్ అలీ (ర.అ) జయంతి (03-01-2026)
3. కనుమ (16-01-2026)
4. షబ్-ఎ-మెరాజ్ (17-01-2026)
5. శ్రీపంచమి (23-01-2026)
6. షబ్-ఎ-బరాత్ (04-02-2026)
7. షహాదత్ హజ్రత్ అలీ (ర.అ) (10-03-2026)
8. జుమాతుల్ విదా (13-03-2026)
9. షబ్-ఎ-ఖదర్ (17-03-2026)
10. మహావీర జయంతి (31-03-2026)
11. తమిళ నూతన సంవత్సరం (14-04-2026)
12. బసవ జయంతి (20-04-2026)
13. బుద్ధ పౌర్ణమి (01-05-2026)
14. ఈద్-ఎ-ఘదీర్ (04-06-2026)
15. 9వ మొహర్రం (1446 హిజ్రీ) (25-06-2026)
16. రథ యాత్ర (16-07-2026)
17. అర్బాయీన్ (04-08-2026)
18. పార్సీ నూతన సంవత్సరం (15-08-2026)
19. వరలక్ష్మి వ్రతం (21-08-2026)
20. రాఖీ పౌర్ణమి (28-08-2026)
21. యజ్ దహుం షరీఫ్ (23-09-2026)
22. మహర్నవమి (19-10-2026)
23. హజ్రత్ సయ్యద్ మొహమ్మద్ జువాన్‌పురి మహ్దీ (అ.స) జయంతి (26-10-2026)
24. నరక చతుర్ధి (08-11-2026)
25. క్రిస్మస్ ఈవ్ (24-12-2026)
26. హజ్రత్ అలీ జయంతి (26-12-2026)