మూడేళ్లుగా కరెంటు బిల్లు కట్టని తేజ్ ప్రతాప్

ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజ్ ప్రతాప్‌కు చెందిన ఓ ప్రైవేటు ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లు గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

tej pratap

తేజ్ ప్రతాప్

పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజ్ ప్రతాప్‌కు చెందిన ఓ ప్రైవేటు ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లు గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ మొత్తం రూ.3.6 లక్షలు దాటినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం తేజ్‌ప్రతాప్‌ ప్రభుత్వ నివాసంలో ఉంటున్నారు. అయితే, పట్నాలో ఆయనకు చెందిన ఓ ప్రైవేటు ఇంటికి చివరిసారిగా 2022 జులైలో కరెంటు బిల్లు చెల్లించారు. గత మూడేళ్లుగా దీనికి సంబంధించిన బకాయిలు పేరుకుపోయాయి. జరిమానాలతో కలిపి ఇప్పుడా మొత్తం కరెంటు బిల్లు రూ.3,61,000కు చేరింది. ఇక తేజ్‌ప్రతాప్‌ పేరు మీద మరో కరెంట్‌ కనెక్షన్‌ ఉన్నట్లు విద్యుత్తు శాఖ డేటా వెల్లడిస్తోంది. దీనికి సంబంధించిన బకాయిలు కూడా జరిమానాలతో కలిపి రూ.3,24,974 చెల్లించాల్సి ఉంది. ఈ వ్యవహారం కాస్త రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. బకాయిలు పేరుకుపోకుండా ఉండేందుకు బీహార్‌ ప్రభుత్వం ప్రీపెయిడ్‌ మీటర్లను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ.. తేజ్‌ ప్రతాప్‌ తన నివాసానికి పోస్ట్‌పెయిడ్‌ మీటర్‌నే కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. రూ.25వేల కంటే ఎక్కువ బిల్లు ఉంటే ఏ పోస్టుపెయిడ్ కనెక్షన్‌ అయినా డీయాక్టివ్‌ చేయాలి. అలాంటిది.. తేజ్‌ప్రతాప్‌ పేరు మీద ఉన్న విద్యుత్తు కనెక్షన్‌ల బకాయిలు రూ.3లక్షలు దాటినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడీ వ్యవహారం కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇక బకాయి చెల్లింపులకు సంబంధించి చర్యలు ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. 


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్