ఐతారం గోలె నెత్తుటి ధారలు... రెండు ప్రమాదాల్లో 19 మంది దుర్మరణం...

ఆదివారం వేళ రోడ్లపై రక్తం ఏరులై పారింది. రెండు చోట్ల జరిగిన భారీ ప్రమాదాల్లో 19 మంది దుర్మరణం చెందారు. వివరాల్లోకెళితే.. తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ఆదివారం రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి.

bus accidents in rajesthan tamilnadu

ప్రతీకాత్మక చిత్రం

తమిళనాడులో రెండు బస్సులు ఢీ.. 11 మంది మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృత్యువాత

చెన్నై/ జైపూర్: ఆదివారం వేళ రోడ్లపై రక్తం ఏరులై పారింది. రెండు చోట్ల జరిగిన భారీ ప్రమాదాల్లో 19 మంది దుర్మరణం చెందారు. వివరాల్లోకెళితే.. తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ఆదివారం రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో కనీసం 11 మృతి చెందగా, 40 మందికిపైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఒక బస్సు కరైకుడి వైపు వెళుతుండగా, మరొకటి మధురై వైపు వెళుతుండగా తిరుపత్తూరు సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఘరో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రయాణికులు బస్సుల్లో చిక్కుకుపోయారని, స్థానికులు, అత్యవసర బృందాలు వారిని బయటకు తీశాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో రెండు ప్రభుత్వ బస్సులు ఢీ కొనడంతో 11 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. కారైకుడికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో 8 మంది మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక చిన్నారి సహా 11 మంది అక్కడికక్కడే మృతి చెందారని జిల్లా పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అధికారులు మాట్లాడారు. 'ఇది ముఖాముఖి ఢీకొనడం కారణమా అని స్పష్టంగా తెలియదు. మేం దానిని పరిశీలిస్తున్నాం.' అని చెప్పారు. గాయపడిన వారిని శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అదికారులు తెలిపారు. ఇందులో కొంతమంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు. అటు.. రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో గల దౌసా-మనోహర్‌పూర్ ఎన్‌హెచ్-148 జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు. జమ్వారామ్‌గఢ్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదం అధిక వేగం ఓవర్‌టేక్ ప్రయత్నం కారణంగా జరిగింది. వేగంగా వస్తున్న ఒక కారు నియంత్రణ కోల్పోయి నేరుగా నిలిపి ఉన్న ట్రైలర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న 8 మంది వ్యక్తులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రహదారి భద్రత ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ప్రాథమిక దర్యాప్తులో అతి వేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ ఎన్‌హెచ్-148 రహదారి గతంలో కూడా అనేక ఘోర ప్రమాదాలకు కారణమైంది. ఈ మార్గంలో 12 కిలోమీటర్ల పరిధిలోనే దాదాపు 8 ప్రమాదాప్రవణ ప్రదేశాలు (బ్లాక్ స్పాట్‌లు) ఉన్నట్లు గుర్తించారు. ఉదాహరణకు, గతంలో ఆగస్టు 13, 2025 న ఇదే దౌసాలో జరిగిన పికప్ వ్యాన్-ట్రక్ ప్రమాదంలో 11 మంది మరణించారు. వారిలో ఏడుగురు పిల్లలు ఉన్నారు. ఈ వరుస ప్రమాదాలు ఈ రహదారిపై మరమ్మత్తు పనులు ట్రాఫిక్ నియంత్రణ కఠినతరం చేయవలసిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. రహదారి భద్రత పెంచాలని నిపుణులు పోలీసులకు సూచిస్తున్నారు. రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఈ ఘటనతో మరింత పెరిగింది.


టీమిండియాకు 10 శాతం జరిమానా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్