పెళ్లి రద్దు వార్తలకు స్మృతి చెక్ బయోలో దిష్టి రక్ష ఎమోజీ

పెళ్లి వాయిదాపై వస్తున్న వార్తలకు టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెక్ పెట్టింది. తన ప్రియుడు, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో వివాహాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది

smiriti mandana marriage cancellation rumour

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి వాయిదాపై వస్తున్న వార్తలకు టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెక్ పెట్టింది. తన ప్రియుడు, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో వివాహాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. స్మృతి, పలాశ్ ముచ్చల్ తమ ఇన్‌స్టాగ్రామ్ బయోలో దిష్టి రక్ష ఎమోజీలను చేర్చారు. తద్వారా తమకు ఎలాంటి సమస్యలు లేవనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. నవంబర్ 23 జరగాల్సిన స్మృతి-పలాష్ వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. స్మృతి మంధాన తండ్రి గుండెపోటు లక్షణాలతో బాధపడటంతో పెళ్లిని వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ పెళ్లికి సంబంధించిన పోస్ట్‌లు స్మృతి మందాన సోషల్ మీడియా ఖాతాల్లో మాయమయ్యాయి. ముఖ్యంగా పలాష్‌తో ఎంగేజ్‌మెంట్ ధ్రువీకరిస్తూ.. నిశ్చితార్థ రింగ్‌ను చూపిస్తూ స్మృతి పోస్ట్ చేసిన వీడియో కనిపించలేదు. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికల్లో పంచుకున్న స్మృతి సహచరులు జెమీమా, శ్రేయాంక్ పాటిల్‌ కూడా తొలగించడంతో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ఈ వార్తలకు స్మృతి దిష్టి రక్ష ఎమోజీతో చెక్ పెట్టింది.


టీమిండియాకు 10 శాతం జరిమానా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్