Halal Air India | హలాల్ భోజనంపై ఎయిరిండియా సంచలన ప్రకటన

హలాల్ భోజనంపై ఎయిరిండియా సంచలన ప్రకటన చేసింది. తమ విమానాల్లో ప్రయాణికులకు అందింజే భోజనంలో విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.

air india meals halal

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ, ఈవార్తలు : హలాల్ భోజనంపై ఎయిరిండియా సంచలన ప్రకటన చేసింది. తమ విమానాల్లో ప్రయాణికులకు అందింజే భోజనంలో విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇకపై హిందువులు, సిక్కులకు హలాల్ సర్టిఫైడ్ భోజనం అందించబోమని స్పష్టం చేసింది. MOML అంటే ముస్లిం భోజనంగా, SPML అంటే ప్రత్యేక భోజనంగా అందిస్తామని వివరించింది. MOML స్టిక్కర్ ఉన్న భోజనాన్ని ముస్లిం భోజనంగా పరిగణించాలని, SPML ను స్పెషల్ మీల్‌గా పరిగణించాలని వెల్లడించింది. అయితే.. సౌదీలోని అన్ని భోజనాలు హలాల్‌గా ఉంటాయని తెలిపింది. హజ్ విమానాలతో సహా జెద్దా, దమ్మామ్, రియాద్, మదీనా సెక్టార్లలో హలాల్ సర్టిఫికెట్ ఉంటుందని పేర్కొంది.

‘MOML అని రాసి లేబుల్ ఉండే ఆహారం.. ముస్లిం కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా భారతీయ వంటకాల పద్ధతిలో హలాల్ సర్టిఫికేషన్ నిబంధనలకు లోబడి ఆహారాన్ని తయారుచేస్తాం. HNML అని రాసి లేబుల్ ఉండే ఆహారం.. హిందూ కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా భారతీయ వంటకాల పద్ధతిలో చికెన్, ఫిష్, ఎగ్స్, కూరగాయలు, డెయిరీ ఉత్పత్తులను అందజేస్తాం. జైనుల కోసం VJML మీల్, జ్యూయిష్ కమ్యూనిటీ కోసం KSML మీల్ అందిస్తాం’ అని వివరించింది.


2026లో 27 సాధారణ సెలవులు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్