అమెరికాను వణికిస్తున్న మరో ప్రకృతి విపత్తు.. మంచు తుఫానుతో 8 మంది మృతి

అమెరికాను మరో ప్రకృతి విపత్తు వణికిస్తోంది. మొన్నటిదాకా లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చుతో ఆ నగరం మొత్తం కాలి బూడిదైపోగా, తాజాగా దక్షిణ అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టించింది.

winter storm texas

టెక్సస్‌లో పరిస్థితి

టెక్సస్, ఈవార్తలు : అమెరికాను మరో ప్రకృతి విపత్తు వణికిస్తోంది. మొన్నటిదాకా లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చుతో ఆ నగరం మొత్తం కాలి బూడిదైపోగా, తాజాగా దక్షిణ అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. టెక్సస్ నుంచి మొదలై ఫ్లోరిడా, నార్త్ కరోలినా వరకు విస్తరించిన మంచు తుఫాను వల్ల 8 మంది మృత్యువాత పడ్డారు. మంచు తుఫానుతో పలు నగరాలు గడ్డకట్టుకుపోయాయి. రికార్డు స్థాయిలో కురుస్తున్న మంచు వల్ల న్యూ ఓర్లీన్, అట్టాంటా, జాక్సన విలే నగరాలు మంచు ముద్దగా మారిపోయాయి. దానికి తోడు చలి గాలులు చుక్కలు చూపిస్తున్నాయి. మంచు తుఫాను వల్ల విమాన సర్వీసులు రద్దయ్యాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

ఆర్కిటిక్ నుంచి మధ్య పశ్చిమ, తూర్పు అమెరికా ప్రాంతాల మీదుగా గాలి వాతావరణం వల్లే గడ్డకడుతోందని అధికారులు వివరించారు. నేడు, రేపు కూడా పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా న్యూ ఓర్లీన్స్‌లో రికార్డు స్థాయిలో 10 ఇంచులు (25 సెంటమీటర్ల మేర మంచు కురిసిందని తెలిపింది. అలస్కాలో డిసెంబర్ నుంచి కురుస్తున్న హిమపాతాన్ని మించి సరికొత్త రికార్డు నమోదైందని వివరించింది. శీతల గాలులు, చల్లని ఉష్ణోగ్రత నేడు, రేపు కూడా కొనసాగుతాయని పేర్కొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్