పాకిస్థాన్‌ను భయపెడుతున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. ఈ సంస్థ చరిత్ర ఏంటంటే..

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. దీన్నే బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని కూడా అంటారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలోని బలూచ్ జాతి ఉగ్రవాద సంస్థ. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం కల్పించడమే దీని లక్ష్యం.

BALOCHISTAN

బలూచిస్థాన్ మ్యాప్

ఇస్లామాబాద్, ఈవార్తలు : బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. దీన్నే బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని కూడా అంటారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలోని బలూచ్ జాతి ఉగ్రవాద సంస్థ. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం  కల్పించడమే దీని లక్ష్యం. 2000వ సంవత్సరంలో ఏర్పాటైన ఈ సంస్థ.. పాకిస్థాన్ సార్వభౌమాధికారం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఈ సంస్థ పాకిస్థాన్ సాయుధ దళాలు, పౌరులే లక్ష్యంగా దాడులు చేస్తుంది. 2004లో బలూచిస్థాన్ ప్రజల స్వయం నిర్ణయాధికారం కోసం, పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్‌ను వేరుచేసేందుకు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా.. హింసాత్మక పోరాటాన్ని ప్రారంభించింది.

ఎందుకీ హింసాత్మక పోరాటం?

బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజవాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. పాక్‌ ఖజానాకు వీటిదే మెజారిటీ వాటా. కోటిన్నర జనాభా ఉన్న ఈ పర్వత రాష్ట్రంలో మాత్రం అత్యధిక పేదరికం ఉంది. 1947 నాటికి ఈ ప్రాంతం పలువురు స్థానిక పాలకుల అధీనంలో ఉండేది. 1948 మార్చి 27న పాకిస్థాన్‌ సైన్యం బలోచ్‌ భూభాగంలోకి ప్రవేశించి ఒత్తిడి తీసుకురావడంతో పాక్‌లో చేరింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో అసంతృప్తి రగులుతూనే ఉంది. 

భారత్‌పై ఆరోపణలు

బలూచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీకి భారత్ నిధులు సమకూర్చుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాందహార్, జలాలాబాద్ సహా అఫ్ఘనిస్థాన్‌లోని భారత కాన్సులేట్‌లు ఈ సంస్థకు ఆయుధాలు, శిక్షణ, ఆర్థిక సహాయం అందించినట్లు పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అయితే, తమకు భారత్‌తో ఎలాంటి సంబంధాలు లేవని బలూచ్ వేర్పాటువాది హైర్బైర్ స్పష్టం చేశారు. భారత్ కూడా పాకిస్థాన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అయితే, అఫ్ఘనిస్థాన్ మాత్రం బలూచ్ ఆర్మీకి రహస్య మద్దతును ప్రకటించింది.


2026లో 27 సాధారణ సెలవులు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్