హిల్ట్ లీక్‌పై విజి‘లెన్స్’.... అంతర్గతంగా ఏం జరిగిందనే దానిపై విచారణ...

హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకురావాలని భావించిన కీలక విధాన నిర్ణయం (హిల్ట్ పాలసీ) జీవో విడుదల కాకముందే ప్రతిపక్షాలకు లీక్ కావడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Telangana orders Vigilance to probe HILT deta

ప్రతీకాత్మక చిత్రం

నవంబర్‌ 20నే ఫోటోషాప్‌ స్లైడ్స్‌ బయటకు?

21న హిల్ట్‌ పాలసీపై కేటీఆర్ ప్రెస్‌మీట్‌

22న జీవో సర్కారు జీవో విడుదల

హైదరాబాద్, డిసెంబర్ 3 (ఈవార్తలు): హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకురావాలని భావించిన కీలక విధాన నిర్ణయం (హిల్ట్ పాలసీ) జీవో విడుదల కాకముందే ప్రతిపక్షాలకు లీక్ కావడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్గతంగా ఈ కీలక సమాచారం బయటకు ఎలా వచ్చిందనే దానిపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించి, విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పారిశ్రామిక భూములపై హిల్ట్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్న దశలోనే, ఈ సమాచారం బయటకు లీకైంది. నవంబర్ 20వ తేదీ నాడే ఈ పాలసీకి సంబంధించిన ఫొటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చినట్టుగా ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ లీకేజీ జరిగిన మరుసటి రోజు, అంటే నవంబర్ 21న, ప్రతిపక్ష నాయకుడైన కేటీఆర్ హిల్ట్ పాలసీపై మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నవంబర్ 22న ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది. జీవో రాకముందే ఈ సమాచారం ప్రతిపక్షాలకు చేరడంపై సర్కార్ తీవ్రంగా సీరియస్ అయింది. పరిశ్రమల శాఖలో పాలసీ తయారీ సమయంలోనే ఈ కీలక సమాచారాన్ని ఎవరు లీక్ చేశారు అనే విషయాన్ని తేల్చేందుకు అధికారులు ఇప్పటికే శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. అయితే, ఈ వ్యవహారం తీవ్రత దృష్ట్యా, ముందే సమాచారాన్ని లీక్ చేసిన వారిని గుర్తించడానికి, దీని వెనుక ఉన్న అంతర్గత కారణాలను తెలుసుకోవడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణ తర్వాతే లీకేజీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


టీమిండియాకు 10 శాతం జరిమానా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్