హిడ్మాకు 3 రోజులు చిత్రహింసలు

మావోయిస్టు అగ్రనేత మాడ్వీ హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. అందులో, వైద్యం కోసం విజయవాజ వచ్చిన హిడ్మాను అరెస్ట్ చేసి.. మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి ఆ తర్వాత మారేడుమిల్లిలో బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపణలు గుప్పించింది.

hidma

హిడ్మా

విజయవాడకు వైద్యం కోసం వచ్చిన మాడ్వీ

నిరాయుధుడిని అరెస్టు చేసి హింసించారు

మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

రాయ్‌పూర్: మావోయిస్టు అగ్రనేత మాడ్వీ హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. అందులో, వైద్యం కోసం విజయవాజ వచ్చిన హిడ్మాను అరెస్ట్ చేసి.. మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి ఆ తర్వాత మారేడుమిల్లిలో బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపణలు గుప్పించింది. ఇది కేంద్ర హోం మంత్రి అమి షా ఆధ్వర్యంలో జరిగిందని మావోయిస్టు పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా హిడ్మా హత్యలో దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి హస్తం ఉందన్న ఆరోపణలను ఖండించింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ మాడ్వి హిడ్మాతో పాటు మరో ఐదుగురు, ఏవోబీ ఎస్‌జడ్‌సీ సభ్యుడు శంకర్‌ది ముమ్మాటికీ హత్య అని ఆరోపించింది. హిడ్మా నవంబర్ 15న చికిత్స కోసం విజయవాడకు వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారని పేర్కొంది. ఆ తర్వాత మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారని.. అనంతరం నవంబర్ 18న హిడ్మాతో పాటు ఆయన అనుచరులను ఎవరికీ అనుమానం రాకుండా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారెడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఏపీ పోలీసులు హతమార్చారని సంచలన ఆరోపణలు చేసింది. అలాగే నవంబర్ 19న రంపచోడవరంలో శంకర్‌తో సహా మరో 6 మందిని హత్యచేశారని మావోయిస్టు పార్టీ చెప్పింది. మొత్తం 13 మంది మావోయిస్టులు హతమయ్యారు, 50 మందిని అరెస్టు చేశారని పేర్కొంది. అరెస్ట్ అయిన వారిలో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి లేరని క్లారిటీ ఇచ్చింది. ఇది వరకే లొంగిపోయిన పార్టీ సభ్యుడు కుసాల్ హిడ్మా కదలికలపై పోలీసులకు సమాచారం ఇచ్చాడని చెప్పింది. అంతేకాకుండా విజయవాడకు చెందిన ఓ కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్‌తో పాటు అల్లూరి జిల్లాలో ఐటీడీఏ కాంట్రాక్టర్లు ఇందులో కీలక పాత్ర పోషించారని ఆరోపించింది. ఇది ఏపీ పోలీసులు చేసింది కాదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీల జాయింట్ ఆపరేషన్ అని, దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూత్రధారి ఆరోపణలు గుప్పించింది. హిడ్మా హత్యతో పార్టీ అగ్రనేత దేవ్‌జీకి కారణమనే ఆరోపణలను మావోయిస్టు పార్టీ ఖండించింది. దేవ్‌ జీ పోలీసులతో ఒప్పందం చేసుకుని మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారనేది అవాస్తవమని చెప్పింది. పోరాట వీరుడిపై నిందలు వేస్తున్నారని చెప్పింది. మావోయిస్టు పార్టీపై కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని మండిపడింది. అంతేకాకుండా భారత్‌ను కార్పొరేట్ హిందూ దేశంగా మార్చాలని.. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆరెస్సెస్-బీజేపీ ప్రభుత్వాలు కగార్ యుద్ధం సాగిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. మావోయిస్టు పార్టీ సభ్యుల హత్యలపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేసింది


టీమిండియాకు 10 శాతం జరిమానా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్