హరింపులు జరిగే అత్యంత కఠినమైన యుద్ధక్షేత్రంగా దీనికి పేరుంది. సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే ఈ ప్రాంతంలో దీనిని ‘భారత్ రణ్‌భూమి దర్శన్’ కార్యక్రమం కింద నిర్మించారు.
గల్వాన్
గల్వాన్: హరింపులు జరిగే అత్యంత కఠినమైన యుద్ధక్షేత్రంగా దీనికి పేరుంది. సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే ఈ ప్రాంతంలో దీనిని ‘భారత్ రణ్‌భూమి దర్శన్’ కార్యక్రమం కింద నిర్మించారు. ఈ ఏడాది ఆర్మీ దినోత్సవం నాడు దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ యుద్ధ స్మారకాన్ని ఎరుపు-నలుపు రంగు గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. ఇవి త్యాగం, వీరత్వానికి చిహ్నంగా నిలిచాయి. త్రిశూల్-డమరు మోడల్‌లో ఇవి ఉన్నాయి. దీంతోపాటు మన అమరవీరులకు గుర్తుగా కాంస్యంతో చేసిన 20 బొమ్మలను ఏర్పాటు చేశారు. ఇక ఈ యుద్ధ స్మారకం కాంప్లెక్సులో మ్యూజియం, గల్వాన్ ఘటనను తెలియజేసే డిజిటల్ గ్యాలరీ, లద్ధాఖ్ సైనిక చరిత్రను తర్వాత తరాలకు అందించేలా ఏర్పాటు చేశారు. 2020 జూన్ 15వ తేదీన రాత్రి భారత్-చైనా దళాల మధ్య గల్వాన్‌లో భీకర ఘర్షణ చోటుచేసుకొంది. ఇరు దేశాల మధ్య దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత చోటుచేసుకొన్న రక్తపాతం ఇది.
సరిహద్దు రహదారులు జాతీయ భద్రతకు జీవనాధారాలు: రాజ్‌నాథ్ సింగ్
‘సరిహద్దు రహదారులు.. జాతీయ భద్రతకు జీవనాధారాలు’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అత్యవసర సమయాల్లో సత్వరం స్పందించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో రూ.5000 కోట్లతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 125 ప్రాజెక్టులను ఆదివారం ఆయన జాతికి అంకితం చేశారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పడానికి ఈ ప్రాజెక్టులే ఉదాహరణలని అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్ము, కశ్మీర్‌తోపాటు సరిహద్దు రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మిజోరంలలో వ్యూహాత్మకంగా 28 రహదారులు, 93 వంతెనలు, మరో నాలుగు ఇతర ప్రాజెక్టులను బీఆర్‌వో నిర్మించింది.