కోట్లలో ఆస్తి నష్టం.. కొండగట్టు గుట్ట కింద 25 షాపులు ఆహుతి...

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు గుట్ట కింది షాపుల్లో అగ్ని ప్రమాద ఘటనలో రూ.కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. త్వరలో మేడారం జాతర ఉన్న నేపథ్యంలో బొమ్మల షాపుల యజమానులు పెద్ద ఎత్తున సామగ్రి కొని ఉంచారు.

fire accident in kondagattu

ప్రతీకాత్మక చిత్రం


- ఓ బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న 8 లక్షలు బుగ్గి

- ఘటనాస్థలిలో కలెక్టర్, మంత్రి, ఎమ్మెల్యే పర్యటన

- ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ

మల్యాల, నవంబర్ 30 (ఈవార్తలు): జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు గుట్ట కింది షాపుల్లో అగ్ని ప్రమాద ఘటనలో రూ.కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. త్వరలో మేడారం జాతర ఉన్న నేపథ్యంలో బొమ్మల షాపుల యజమానులు పెద్ద ఎత్తున సామగ్రి కొని ఉంచారు.  అవి కూడా కాలి బూడిదయ్యాయి. ప్రతి దుకాణంలో దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విలువైన సామగ్రి ఆహుతైంది. ఓ కుటుంబం తమ బిడ్డ పెళ్లి కోసం రూ.8 లక్షలు దాచుకోగా, పూర్తిగా కాలిపోయాయి. దీంతో ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణణాతీతంగా మారింది. కాగా, బాధిత కుటుంబాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తదితరులు పరామర్శించారు. బాధితులకు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు, మహిళా సంఘాల ద్వారా వడ్డీ లేని రూ.5 లక్షలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. బాధితులను ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. సోమవారం నుంచి రేకుల షెడ్ల పునర్నిర్మాణం, విద్యుత్తు కనెక్షన్ల పునరుద్ధరణ చేపట్టనున్నారు


ధనాధన్.. దంచేద్దాం... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమిండియా సంసిద్ధం...
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్