కూతుళ్ల కోసం తండ్రులు ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగానే ఉంటారు.
ప్రతీకాత్మక చిత్రం
కూతుళ్ల కోసం తండ్రులు ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగానే ఉంటారు. వాళ్ల మీద చూపించే ప్రేమ ఆ స్థాయికి చేర్చుతుంది మరి. చైనాలోనూ ఓ తండ్రి తన కూతురి కోసం ఆశ్చర్యపోయే పని చేశాడు. తన కూతురి యూనివర్సిటీ బయట చిన్న ఫుడ్ స్టాల్‌ను పెట్టాడు. దీనికే ఏం గొప్ప.. అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. తన కూతురికి ఇష్టమైన ఆహారం అందించే ఉద్దేశంతోనే ఈ హోటల్‌ను పెట్టాడట. పైగా, తన ఉద్యోగానికి రాజీనామా చేసి, 900 కిలోమీటర్లు వచ్చి తన బిడ్డ జిహ్వకు మంచి రుచి అందించడం కోసం ఫుడ్ స్టాల్ పెడ్డటం అంటే విశేషమే కదండోయ్