ముళ్ల పొదల్లో నవజాత శిశువు ...కాపాడిన అంబులెన్స్‌ సిబ్బంది

నారాయణపేట జిల్లాలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన నవజాత ఆడ శిశువును తల్లిదండ్రులు ముళ్ల పొదల్లో పడేసి మానవత్వాన్ని మంటగలిపారు.

ambulance staff rescue

ప్రతీకాత్మక చిత్రం

నారాయణపేట, నవంబర్ 30 (ఈవార్తలు): నారాయణపేట జిల్లాలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన నవజాత ఆడ శిశువును తల్లిదండ్రులు ముళ్ల పొదల్లో పడేసి మానవత్వాన్ని మంటగలిపారు. అటుగా వెళ్తున్న స్థానికులు శిశువు ఏడుపు విని 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది పరీక్షించి వైద్యం అందించి రక్షించి బాధ్యతను నెరవేర్చారు. నారాయణపేట  మండలం అప్పక్ పల్లి గ్రామం కాటన్ మిల్‌ సమీపంలో ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును వదిలేసి వెళ్లారు. స్థానికులు చిన్నారి ఏడుపులు విని అంబులెన్స్‌కు సమాచారం అందజేయడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకొని, ఆ నవజాత శిశువును కాపాడారు. స్వల్ప గాయాలతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న శిశువును గమనించిన అంబులెన్స్‌ టెక్నీషియన్స్ శిరీష ప్రథమ చికిత్స చేసి నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మహేందర్ శిశువును పరీక్షించి, ప్రస్తుతం శిశువు ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వెల్లడించారు. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన 108 సిబ్బంది, టెక్నీషియన్ శిరీష, పైలెట్ రాములును అంబులెన్ష్‌ సూపర్‌వైజర్‌ రాఘవేంద్ర అభినందించారు.


ధనాధన్.. దంచేద్దాం... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమిండియా సంసిద్ధం...
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్