2 కోట్ల మంది ఆధార్ తొలగింపు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా మంది ఆధార్ నంబర్లను తొలగిస్తున్నట్లు ఉడాయ్ ప్రకటించింది. వేరేవారు వాడకుండా కేవలం మరణించిన వారి ఆధార్ నంబర్లను డేటా బేస్ నుంచి తొలగించింది.

aadhar news

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా మంది ఆధార్ నంబర్లను తొలగిస్తున్నట్లు ఉడాయ్ ప్రకటించింది. వేరేవారు వాడకుండా కేవలం మరణించిన వారి ఆధార్ నంబర్లను డేటా బేస్ నుంచి తొలగించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, ప్రజా పంపిణీ వ్యవస్థ, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం, వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి మరణించిన వ్యక్తుల డేటాను ఇటీవల ఉడాయ్ సేకరించింది. అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కొంతమంది మరణించినవారి ఆధార్ కార్డులను వేరే పనులకు ఉపయోగించుకునే అవకాశముంది. దీంతో పాటు ఆధార్ డేటాబేస్ నిరంతర కచ్చితత్వాన్ని నిర్వహించడానికి దేశవ్యాప్తంగా మరణించిన వ్యక్తుల ఆధార్ నంబర్లను తొలగించినట్లు అధికారులు స్పష్టం చేశారు. తొలగించిన ఆధార్ నంబర్‌ను మరొక వ్యక్తికి తిరిగి కేటాయించబోమని అధికారులు స్పష్టం చేశారు. మరణించిన వ్యక్తి ఆధార్‌ను మోసపూరితంగా కొంతమంది సంక్షేమ పథకాల కోసం ఉపయోగించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, అందుకే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్ తెలిపింది. ఇప్పటికే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్న రాష్ట్రాల్లో మరణాలను నమోదు చేసేందుకు మై ఆధార్ పోర్టల్‌లో కుటుంబసభ్యులు తమ ఇంట్లోని వ్యక్తులు ఎవరైనా మరణిస్తే నివేదించే సౌకర్యాన్ని ఉడాయ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, పలు కారణాల వల్ల బతికి ఉన్నవారి ఆధార్ తొలగిస్తే.. మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కోసం ఉడాయ్ ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించాలి.


ధనాధన్.. దంచేద్దాం... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమిండియా సంసిద్ధం...
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్