వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీ.. సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్గా అభిమానులతో టచ్ లో ఉంటుంది.
తృప్తి డిమ్రీ
స్పిరిట్ హీరోయిన్ ఎనర్జీ బూస్టర్ ఇదే...
వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీ.. సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్గా అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలను షేర్ చేయడం మాత్రమే కాకుండా తన రొటీన్ లైఫ్ ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన ఎనర్జీ బూస్టర్ అంటూ ఒక చిన్న వీడియోని షేర్ చేసింది. మనలో చాలా మందికి అలసటగా ఉన్నప్పుడు టీ తాగడం అలవాటుగా ఉంటుంది. టీ తాగితే చాలా వరకు రిప్రెషన్ అయినట్లుగా అనిపిస్తుంది. మనలో చాలా మంది టీ తాగడం ద్వారా తిరిగి ఎనర్జీ పొందినట్లు ఫీల్ పొందుతారు. హీరోయిన్ తృప్తి కూడా తన ఎనర్జీ బూస్టర్ చాయ్ బిస్కెట్ అంటూ ఈ వీడియో ద్వారా చెప్పకనే చెప్పింది. చాయ్ బిస్కెట్ ఎంతో ఇష్టంగా తింటాను అంటూ తృప్తి తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇంస్టాగ్రామ్ ద్వారా వీడియోను షేర్ చేసి అభిమానులతో పంచుకుంది.