పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానుల్లో ‘ది రాజా సాబ్’ ఏకంగా 3 గంటల 14 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకురానుందట. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.
రాజా సాబ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానుల్లో ‘ది రాజా సాబ్’ ఏకంగా 3 గంటల 14 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకురానుందట. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమెరికాలోని ప్రముఖ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్లలో ఈ సినిమా రన్‌టైమ్‌ను అధికారికంగా ప్రకటించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మారుతి సినిమాలు తక్కువ నిడివితో ఉంటాయి. కానీ, ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ‘సలార్’, ‘కల్కి’ చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా సుదీర్ఘ రన్‌టైమ్‌తో ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని పంచనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు