తలైవర్ 173 నుంచి డైరెక్టర్ ఔట్

తలైవర్ 173 నుంచి డైరెక్టర్ ఔట్

thalivar 173 director twist

ప్రతీకాత్మక చిత్రం

సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'తలైవర్ 173' ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా ఈ సినిమాను ప్రకటించిన క్షణం నుంచి అంచనాలు హై రేంజ్ కు వెళ్లాయి. ఈ మెగా ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, సినిమా యూనిట్ నుంచి ఒక సడన్ అప్‌డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక కీలక వ్యక్తి తప్పుకున్నట్లు వచ్చిన వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది. సినిమాకు కెప్టెన్‌గా ఉండాల్సిన వ్యక్తే తప్పుకోవడంతో, ఇప్పుడు ఈ సినిమా భవిష్యత్తు ఏంటి, అసలు ఎందుకిలా జరిగిందనే చర్చ మొదలైంది. డైరెక్టర్ సుందర్ సి. స్వయంగా ఒక ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశారు. "కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా" తాను 'తలైవర్ 173' లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడం తన హృదయానికి చాలా భారంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి ఇద్దరు లెజెండ్స్‌తో పనిచేయడం తన కల అని, ఆ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని సుందర్ సి. తెలిపారు. వాళ్లతో గడిపిన కొద్ది రోజులైనా తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చాయని, వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని లెటర్‌లో పేర్కొన్నారు.


ఇక గూగుల్ రోడ్డు.. టీసీఎస్ వీధి!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్